గోర్లవీడు కాంప్లెక్స్ పరిధిలోని FLN శిక్హషణలో హజరగు ఉపాధ్యాయుల (సబ్జెక్టుల వారీగా )వివరాలు
సరికొత్త ఒరవడితో తొలిమెట్టు
5+1 పద్ధతిలో విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపు*
ఆగస్టు 2 నుంచి మండలాల్లో 2వేల మందిపైగా టీచర్లకు ట్రైనింగ్
శిక్షణ అనంతరం హ్యాండ్‌బుక్స్, వర్క్‌షీట్స్ పంపిణీ
ప్రాథమిక విద్యా బలోపేతం లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గత విద్యాసంవత్సరం నుంచి ఫౌండేషన్ లిటరసీ అండ్* *న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్) పేరుతో తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విద్యాశాఖ అధికారులు ఈసారి మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక* *రూపొందించారు. ఇప్పటికే ఇందుకు అవసరమైన శిక్షణను ఉపాధ్యాయులకు ఇస్తున్నారు.ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్లో చదవడం, రాయడం, అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా మాతృభాషలో, ఇంగ్లీష్‌లో, గణితంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. సబ్జెక్టుకు రెండ్రోజుల చొప్పున శిక్షణ ఇస్తారు. . ఈ శిక్షణా కార్యక్రమం పూర్తి కాగానే ఉపాధ్యాయులకు లెసెన్ ప్లాన్స్, పీరియడ్ ప్లాన్స్‌తో కూడిన 200 పేజీల హ్యాండ్ బుక్స్ అందిస్తారు. విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన వర్క్ షీట్స్ ఇవ్వనున్నారు.
*💥ప్రతి పాఠాన్నీ 5ప్లస్ 1 పద్ధతిలో రూపకల్పన*
ప్రతిరోజూ పీరియడ్ తర్వాత పిల్లల చేత టీచర్ అభ్యసన పత్రాన్ని పూర్తిచేయిస్తారు. ఆరో రోజు విద్యార్థులు మూల్యాంకన పత్రాన్ని పూరిస్తారు. అలా విద్యార్థులు ఆ పాఠానికి సంబంధించిన సామర్థ్యాలను సాధించారా? లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు తెలుసుకోగలుగుతారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, మండల విద్యాధికారులు, గెజిటెడ్ హెచ్‌ఎంలు నోడల్ అధికారులుగా ఉండి అమలును పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో డీఈవో, సెక్టోరియల్ అధికారులు, ఎన్‌సీఆర్టీ అధికారులతో మానిటరింగ్ బృందాల పర్యవేక్షణ ఉంటుంది.
గోర్లవీడు కాంప్లెక్స్ పరిధిలోని FLN శిక్హషణలో హజరగు ఉపాధ్యాయుల (సబ్జెక్టుల వారీగా )వివరాలు.
Subject wise teacher details of Gorlaveedu complex to attend FLN Training Download Pdf
FLN Proceedings R.C.No 833/Be/2022
Mandal Level FLN Training Timings:9.30am to 5.00pm
Spell Dates Subject
Spell-I 02.08.2023 & 03.08.2023 Telugu
Spell-II 4.8.2023 & 5.8.2023 Mathematics
Spell-III 07.08.2023 & 08.08.2023 English
Comments
Post a Comment